Posts

*ఈ* :మంచివాడెప్పుడూ గొప్పవాడికన్నా ఉత్తముడు. 7. తే"గీ : గొప్ప వాడనంగ చదువు కొలువు లనుచు ! సత్య ధర్మంబు లొదిలి వాంచలను పెంచు ! మ ంచివాడెంచు సేవ ధర్మంబు లెపుడు!గొప్ప కూలి మంచి నిలచు గాల గమన! *తాత్పర్యము* : ఈ రోజుల్లో ప్రజలు గొప్ప వారు కావాలని పెద్ద చదువులు పదవులు ఆశిస్తూ సత్యము ధర్మాలను వదలి కోరిక లను పెంచుకొను చున్నారు.మంచి వారు ఎపుడూ సేవ, ధర్మము లను పాటించెదరు. గొప్ప ఎప్పటికైనా నశించునది.మంచి కలకాలమూ నిలచునది.8. కందము :గొప్ప ధనము ధర్మంబే!ఎప్పటికీ నిలచు విద్య ఈశ్వర తపనం!తెప్పలుగ బలం సైన్యం!బొప్పు ప్రేమాదరణల పురి ధర్మాత్మా! *తాత్పర్యము* :ఓ ధర్మగుణములు కలవాడా! ధర్మమే అన్నిటికన్నా గొప్ప ధనము. అన్ని విద్య లయందు దేవుని యoదు విశ్వాసము కలుగుటయే గొప్ప విద్య. ప్రేమాధరణ లతో గొప్ప బలంసైన్యం సంపాదించవచ్చును.

ధర్మంపక్షం - 5&6

*ఇ* . కృష్ణార్జునల  స్నేహం సుఫల స్నేహం -అది నేర్చుకొనుము : స్నేహితుని ప్రవర్తన లో దాగియున్న భాధ, ప్రేమ, కారణాలను తెలుసుకొన్న స్నేహము చిరకాలము నిలుచును . 5. తే"గీ : విఫల నెయ్యమన్న        తుదకు వీగిపోవు !                సఖులు సౌఖ్య మందగ     నది సఫలమనురు ! మిత్రు లిద్దరితొ జగతి               మేలు జరగ ! గొప్పఫల స్నేహమది            నేర్వ కృష్ణ పార్ధ!  *తాత్పర్యము* : స్నేహితులు,మరి ఎవ్వరికీ మంచిజరగని స్నేహమును విఫల స్నేహ మందురు. స్నేహితులిద్దరికకీ  మంచిజరిగితే అది సఫల స్నేహము. ఇద్దరి కేకాక జగతి అంతకూ మంచి జరిగితే అది సుఫల స్నేహము. కృష్ణార్జుల స్నేహము అందరూ నేర్వదగిన సుఫల స్నేహము. 6. కందము : తెలియుము భాధను                  నవ్వున ! మలిగున్న ప్రియత        కరణముబట్టు              లెరుగుమా ! చెలికాని కోప చింతన ! కలకాలము నిలచు              నెయ్యి గని                  ధర్మాత్మా !  *తాత్పర్యము* : ఓ ధర్మ గుణములు కలవాడా! నీవు నీ స్నేహితుని నవ్వులోని భాధను, కోపము, చింతల లోని ప్రేమ కారణాలను తెలుసుకొని మెలిగితే మీ స్నేహము కలకాలమూ నిలుస్తుంది.

ధర్మ పక్షం -1నుండి 4

🕉️  అ : ధర్మపక్షము  అను నామముతో *ధర్మాత్మా* అను మకుటముతో వ్రాయబడు ఈశత పద్యావళి ప్రారంభం 👇  *ఓం శ్రీ సాయిరాం*                              💐 *1 : కందము*       శ్రీస్వామి చరణ                       కమలం ! బాసీన బరచి         శిరంబువాల                        జనించే !  భాసుర కుసుపద                         జారగ !  నేస్వాంతత నేరికూ          ర్చెనివి ధర్మాత్మా ! తాత్పర్యము : ఓ ధర్మ గుణములు కలవాడా! నేను భగవంతుని పాద ములపై కమలములుఉంచి శిరసువంచి నమస్కరించగా గొప్ప పద్య కుసుమములు రాలిపడినవి. వాటిని నేను వెంటనే ప్రోగుచేసి సమకూర్చినవే ఈ పద్యశతకము.            దైవము నందు              విశ్వాసమే అస             లైన విద్య ! 2. *తే.గీ* :      మందు మోతాదు                విజ్ఞాన మంత జదివి !       వ్యాధి బీజంబు             గూల్చని బోధ ననగ !       బారు నేడ్వగ              జెప్పెను బాబనిజము !         సత్య ధర్మ శాంతి                ప్రియౌ షధల నంగ !  తాత్పర్యము :మందులు మోతాదు గురించిన విజ్ఞాన శాస్త్రం ( ఫార్మసీ ) బాగా చదవగా అది రోగమునకు కారణాన్ని నిర్మువులించ లేనివిద్య అని తెలుసుకొని దాని వలన ఏమీ ప్రయోజ నము లేదన