Skip to main content
*ఈ* :మంచివాడెప్పుడూ గొప్పవాడికన్నా ఉత్తముడు. 7. తే"గీ : గొప్ప వాడనంగ చదువు కొలువు లనుచు ! సత్య ధర్మంబు లొదిలి వాంచలను పెంచు ! మ ంచివాడెంచు సేవ ధర్మంబు లెపుడు!గొప్ప కూలి మంచి నిలచు గాల గమన! *తాత్పర్యము* : ఈ రోజుల్లో ప్రజలు గొప్ప వారు కావాలని పెద్ద చదువులు పదవులు ఆశిస్తూ సత్యము ధర్మాలను వదలి కోరిక లను పెంచుకొను చున్నారు.మంచి వారు ఎపుడూ సేవ, ధర్మము లను పాటించెదరు. గొప్ప ఎప్పటికైనా నశించునది.మంచి కలకాలమూ నిలచునది.8. కందము :గొప్ప ధనము ధర్మంబే!ఎప్పటికీ నిలచు విద్య ఈశ్వర తపనం!తెప్పలుగ బలం సైన్యం!బొప్పు ప్రేమాదరణల పురి ధర్మాత్మా! *తాత్పర్యము* :ఓ ధర్మగుణములు కలవాడా! ధర్మమే అన్నిటికన్నా గొప్ప ధనము. అన్ని విద్య లయందు దేవుని యoదు విశ్వాసము కలుగుటయే గొప్ప విద్య. ప్రేమాధరణ లతో గొప్ప బలంసైన్యం సంపాదించవచ్చును.