ధర్మంపక్షం - 5&6
*ఇ* . కృష్ణార్జునల స్నేహం సుఫల స్నేహం -అది నేర్చుకొనుము :
స్నేహితుని ప్రవర్తన లో దాగియున్న భాధ, ప్రేమ, కారణాలను తెలుసుకొన్న స్నేహము చిరకాలము నిలుచును .
5. తే"గీ :
విఫల నెయ్యమన్న
తుదకు వీగిపోవు !
సఖులు సౌఖ్య మందగ
నది సఫలమనురు !
మిత్రు లిద్దరితొ జగతి
మేలు జరగ !
గొప్పఫల స్నేహమది
నేర్వ కృష్ణ పార్ధ!
*తాత్పర్యము* : స్నేహితులు,మరి ఎవ్వరికీ మంచిజరగని స్నేహమును విఫల స్నేహ మందురు. స్నేహితులిద్దరికకీ మంచిజరిగితే అది సఫల స్నేహము. ఇద్దరి కేకాక జగతి అంతకూ మంచి జరిగితే అది సుఫల స్నేహము. కృష్ణార్జుల స్నేహము అందరూ నేర్వదగిన సుఫల స్నేహము.
6. కందము :
తెలియుము భాధను
నవ్వున !
మలిగున్న ప్రియత
కరణముబట్టు
లెరుగుమా !
చెలికాని కోప చింతన !
కలకాలము నిలచు
నెయ్యి గని
ధర్మాత్మా !
*తాత్పర్యము* :
ఓ ధర్మ గుణములు కలవాడా! నీవు నీ స్నేహితుని నవ్వులోని భాధను, కోపము, చింతల లోని ప్రేమ కారణాలను తెలుసుకొని మెలిగితే మీ స్నేహము కలకాలమూ నిలుస్తుంది.