ధర్మ పక్షం -1నుండి 4
🕉️ అ : ధర్మపక్షము అను నామముతో *ధర్మాత్మా* అను మకుటముతో వ్రాయబడు ఈశత పద్యావళి ప్రారంభం 👇
*ఓం శ్రీ సాయిరాం*
💐
*1 : కందము*
శ్రీస్వామి చరణ
కమలం !
బాసీన బరచి
శిరంబువాల
జనించే !
భాసుర కుసుపద
జారగ !
నేస్వాంతత నేరికూ
ర్చెనివి ధర్మాత్మా !
తాత్పర్యము : ఓ ధర్మ గుణములు కలవాడా! నేను భగవంతుని పాద ములపై కమలములుఉంచి శిరసువంచి నమస్కరించగా గొప్ప పద్య కుసుమములు రాలిపడినవి. వాటిని నేను వెంటనే ప్రోగుచేసి సమకూర్చినవే ఈ పద్యశతకము.
దైవము నందు
విశ్వాసమే అస
లైన విద్య !
2. *తే.గీ* :
మందు మోతాదు
విజ్ఞాన మంత జదివి !
వ్యాధి బీజంబు
గూల్చని బోధ ననగ !
బారు నేడ్వగ
జెప్పెను బాబనిజము !
సత్య ధర్మ శాంతి
ప్రియౌ షధల నంగ !
తాత్పర్యము :మందులు మోతాదు గురించిన విజ్ఞాన శాస్త్రం ( ఫార్మసీ ) బాగా చదవగా అది రోగమునకు కారణాన్ని నిర్మువులించ లేనివిద్య అని తెలుసుకొని దాని వలన ఏమీ ప్రయోజ నము లేదని ఏడవగా శ్రీ సత్య సాయి తెలిపినది ఏమనగా నిజమైన ఔష ధములు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమలు మాత్రమే!
*ఆ* : జననీ జనకులు,
జన్మభూమి,
గురువులు
ఎల్లప్పుడూ
ఆరాద్యులు.
*3. తే"గీ:*
ఎదిగి అమెరికా ఎగిరిన
ఎఱుగు మెల్ల !
తపము జేసి సాకిన
నీది తల్లి కరము !
బెరయు నీపద ముద్రలు
పితృని ఉదర !
మరువకు జనధరతిని
నీమరణ దాక !
తాత్పర్యము :ఎదిగిన తర్వాత అమెరికా వెళ్లినా మరణముదాకా ఎప్పుడూ గుర్తించు కోవలసినవి - తపించి నినుపెంచిన తల్లిని, పొట్టపై నిను ఆడించి పోషించిన తండ్రిని నీవు పుట్టిన భూమిని.
4. *కందము* :
చదువొచ్చెను
నాకనుచున్!
చదువిచ్చిన గురుని
పట్ల చౌకను
తగదున్!
పదునిచ్చి రాయి
కత్తిచె!
వెదురుగ నరక
బడితె చెఱుపెటు
ధర్మాత్మా!
తాత్పర్యము : ఓధర్మబుద్దికలవాడా! బాగాచదువు కొన్నానని చదువు చెప్పిన గురువును చులకన చేయరాదు. పదునిచ్చిన రాయినే కత్తితో నరికితే ఆకత్తి పనికి రాకుండా పోతుంది కదా.
నమస్కారములతో
మీ
ధర్మదాత 🙏